1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan delivers a strong counter to Mudragada Padmanabham

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

pawan kalyan
మాట్లాడితే కాపు సామాజిక వర్గం అంటుంటారు కొంతమంది నాయకులు, ఇలాంటి నాయకులు అసలు కాపు సామాజిక వర్గానికి ఏమైనా ప్రయోజనాలు చేకూరుస్తున్నారా అని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన మాట్లాడుతూ... నన్ను ఎన్నికల్లో ఓడించకపోతే తన పేరు మార్చుకుంటాను అని ఒకాయన అన్నారు. తన పేరు వెనుక రెడ్డి సామాజిక వర్గం అయిన రెడ్డి అని పెట్టుకుంటానని అన్నారు.
 
కాపు నాయకులు అలా వున్నారు. మరి ఇతర కులాలకు చెందినవారు ఎవరైనా జగన్ ఓడించకపోతే తన పేరును మరో కులాన్ని సూచించే విధంగా పేరు పెట్టుకుంటామని అన్నారా... కాపు కులానికి ఇతర కులాలకి వున్న తేడా ఇలా కనబడుతోంది కదా అంటూ చెప్పుకొచ్చారాయన. గతంలో పవన్ ఓడించకపోతే పేరు మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నట్లుగా కూడా చెప్పారు.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ