సంబంధిత వార్తలు
01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గత కొంతకాలంగా అనుభవిస్తున్న బాధల నుంచి విముక్తులవుతారు. క్రమంగా అనుకూలతలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. కొత్త పనులు చేపడతారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. సంతానానికి దూరప్రదేశంలో విద్యావకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. తరచు బంధుమిత్రులతో సంభాషిస్తుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. స్నేహసంబంధాలు వెల్లివిరుస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చేతిలో ధనం నిలవదు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. నోటీసులు అందుకుంటారు. సోదరులను సంప్రదిస్తారు. దూరప్రయాణం కలిసివస్తుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కీలక చర్చలు ఫలిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ధనసహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సంతానం ఉన్నత చదువుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. దంపతుల మధ్య తరచు స్వల్పకలహాలు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. ఆదాయానికి మించి ఖర్చులెదురవుతారు. రుణాలు, చేబదుళ్లు తప్పవు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పోయాయనుకున్న పత్రాలు లభ్యమవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం అనుకూలదాయకం. సంతోషకరమైన వార్తలు వింటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. దుబారా ఖర్చులు విపరీతం. ఆప్తులకు సాయం అందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేయగల్గుతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. మరోసారి యత్నించండి. నేడు అనుకూలించనిది రేపు సాధ్యపడుతుంది. విందుకు హాజరవుతారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లావాదేవీలు ఫలిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. తరచు సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వాహనం అమర్చుకోవాలనే కోరిక తీరుతుంది. కీలక పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. వివాస్పద విషయాల్లో జోక్యం తగదు. వాయిదా పడుతూ వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం ద్వితీయార్ధం అనుకూలం. ప్రధమార్ధంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూతమవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవావాలి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. కొత్త ఆలోచనలుర స్ఫురిస్తాయి. మొండిగా పనులుర పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. సంతానం దుడుకుతనం అదుపు చేయండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. ఒంటెద్దు పోకడ తగదు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. విందుకు హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. వ్యవహరాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలించవు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య సఖ్యతలోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఈ చికాకులు తాత్కాలికమే. ద్వితీయార్ధం అనుకూలదాయకం. వేడుకకు హాజరవుతారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. యోగ ధార్మికతల పట్ల ఆసక్తికనబరుస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధాకాదు. అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. నోటీసులు అందుకుంటారు. నిపుణులను సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. విందుకు హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చెల్లింపులు, నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంతానం పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తారు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ఓర్పుతో మరోసారి యత్నించండి. నేడు సాధ్యం కానిది రేపు అనుకూలించవచ్చు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో చర్చలు జరుపుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. వ్యవహారజయం, అనుకూలతలున్నాయి. సమర్ధతను చాటుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. గృహమార్పు కలిసివస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పొగిడేవారి ఆంతర్యం గ్రహించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. ఆత్మీయులతో తరచు కాలక్షేపం చేస్తుంటారు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. గృహనిర్మాణం ముగింప దశకు చేరుకుంటుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పందాలు, సాహసకృత్యాలకు పాల్పడవద్దు.
