మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. స్థిరచరాస్తుల మూలక ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యవహార జయం, కార్యసిద్ధి ఉన్నాయి. వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రియతములను విందులకు ఆహ్వానిస్తారు. ముఖ్యమైన పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సన్మాన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్నిరంగాల వారికీ యోగదాయకమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆప్తులకు కానుకలు అందిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయుల శ్రమ ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ఓర్పుతో ఉద్యోగయత్నాలు సాగించండి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆప్తులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. వేడుకలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. సన్నిహితులతో తరుచు సంభాషిస్తుంటారు. ద్వితీయార్ధం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు సామాన్యం. బెట్టింగ్ల జోలికి పోవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్తపనులు చేపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వేడుకను ఘనంగా చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ప్రియతములను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు నిర్ణయం తగదు. సన్నిహితుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ప్రముఖులకు కానుకలు సమర్పించుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మీ శ్రీమతి లేక శ్రీవారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధ్యాయులు ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం కొంతమేరకు ఆశాజనకం. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, ముఖ్యమైన బాధ్యతలు పురమాయించవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆప్తులతో తరచు సంభాషిస్తుంటారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా మెలగండి. గృహ మరమ్మతులు చేపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పందాలు, వినోదాల్లో దూకుడు తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చేతిలో ధనం నిలవదు. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడుతుంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పట్టుదలకు పోవద్దు. ఆత్మీయులతో తరుచుగా సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగ బాధ్యతల పట్ల ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులు ప్రశంసలందుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు సీకరిస్తారు. కొత్త పనులు చేపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవారిని భంగం కలుగకుండా మెలగండి. ఆప్తులతో కాలక్షేపం చేస్తుంటారు. దంపతుల మధ్య తరచు కలహం. మీ శ్రీమతి వర్గం బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. కనపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. మానసికంగా స్థిమితపడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తొందరపడి నమ్మవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం శుభదాయకం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. స్థిరాస్తి మూలక ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి లోటుండదు. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. దూరపు బంధువులతో సంభాషణ ఉత్సాహం కలిగిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. గృహంలో మార్పుచేర్పులు చేపడతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. మహిళలు పోటీల్లో విజయం సాధిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ నమ్మకం వమ్ము కాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పెట్టుబడులు కలిసిరావు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ద్వితీయార్థంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు కొంతమేరకు అనుకూలిస్తాయి, అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంశక్తితోనే అనుకున్నది సాధిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.