సంబంధిత వార్తలు
- ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు.. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్‌కు కూడా..
- జనవరి 8 నుంచి అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్: ఆమ్రపాలి ఐఏఎస్
- శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం
- మొంథా తుఫాను- 72 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు
జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రైల్వే టైంటేబుల్
నూతన సంవత్సరంలో రైల్వే కొత్త టైంటేబుల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల రాకపోకల్లో చోటుచేసుకునే సమయాలతో ఈ టైంటేబుల్‌ను విడుదల చేయనున్నారు. ఈ కొత్త టైంటేబుల్ జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది. ముఖ్యంగా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా మొత్తం 25 రైళ్లు బయలుదేరే వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
సికింద్రాబాద్ - విశాఖపట్టణం వందే భారత్ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజూ ఉదయం 5.05 గంటలకు బయలుదేరుతుంది. ఇది జనవరి ఒకటో తేదీ నుంచి ఐదు గంటలకే బయలుదేరుతుంది. అలాగే, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 8.20కి బదులుగా 8.10కి, సికింద్రాబాద్ - భద్రాచలం ఎక్స్‌ప్రెస్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 5.25 బదులుగా 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. ఈ మార్పుల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో చూడొచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు.
