బుధవారం, 29 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2025 (22:53 IST)

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

Trains
శాతనవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపేజీపై దక్షణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో స్టాపేజీని కల్పించారు. ఈ నెల 30 నుంచి ప్రయోగాత్మకంగా ఆగుతుందని పేర్కొంది. ఈ స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుందని పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైలుకు రైలుకు స్టాఫ్ కల్పించారు. విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ మధ్య అనునిత్యం రాకపోకలు సాగించే ఈ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై జనగామ్ రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది.
 
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 30వ తేదీ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు జనగామ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఆగుతుందని ప్రకటించింది. విజయవాడ - సికింద్రాబాద్ రైలు ఉదయం 10.14 నుంచి 10.15 గంటల ఒక మధ్య నిమిషంతో పాటు సికింద్రాబాద్ - విజయవాడ రైలు సాయంత్రం 5.19 నుంచి 5.20 గంటల మధ్య జనగామ రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.