Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?
నల్ల ఉప్పులో అధిక బరువును తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తెల్ల ఉప్పు బదులుగా నల్ల ఉప్పు వాడడం మంచిది. దీంతో కడుపు ఉబ్బరాన్ని తగ్గించి బరువు పెరగకుండా చూస్తుంది. నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. నల్ల ఉప్పులోని ఖనిజాలు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్‌గా కూడా పనిచేస్తాయి. అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. ఇది జీవక్రియని పెంచి, జీర్ణక్రియని మెరుగ్గా మారుస్తుంది.
నల్ల ఉప్పు తీసుకుంటే బరువు తగ్గుతారు. నిజానికీ వాడాల్సిన దానికంటే ఎక్కువ పరిమాణంలో ఉప్పు తీసుకుంటే బరువు పెరుగుతారు. అయితే, నల్ల ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. నల్ల ఉప్పులోని యాంటీ ఒబెసిటీ గుణాలు ఊబకాయం, బరువు రెండింటిని తగ్గిస్తాయి.
ఎక్కువగా ఆహారం తిన్న తర్వాత కడుపులో భారంగా అనిపిస్తుంటుంది. అప్పుడు గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు కలిపి టీలా చేసి తాగండి. దీంతో ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. దీంతో బాడీలోని అదనపు కొలెస్ట్రాల్ బర్న్ అవుతుంది.
ప్రతిరోజూ ఉదయం వేడి నీటిలోనల్ల ఉప్పు కలిపి తాగితే అతనికి కడుపు సంబంధిత సమస్యలు రావు. దగ్గుతో బాధపడేవారు నల్ల ఉప్పు ముక్కని నోటిలో పెట్టుకుని రసాన్ని మింగుతుంటే దగ్గు తగ్గుతుంది. నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నల్ల ఉప్పులో పొటాషియం, ఇతర ఖనిజాలు రక్తపోటుని తగ్గిస్తాయి.