Festivals

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు



శుక్రవారంతో ఆరుద్ర నక్షత్రం.. ఏ పూజ చేయాలి.. ఎలాంటి దానం ఇవ్వాలంటే?

Sukha Maharishi: శుక మహర్షి ఎవరు? గురువారం పూజిస్తే?

Sukha Maharishi: శుక మహర్షి ఎవరు? గురువారం పూజిస్తే?శుక మహర్షి వేద వ్యాసుని పుత్రుడు. శుక మహర్షి విచిత్రమైన ఆకారం కలవారు. తల వరకు చిలుక, శరీరం మానవ దేహం. శుక మహర్షి కూడా వేద వ్యాసుని వలే పుట్టుకతోనే పరమ జ్ఞాని. ఐతే తండ్రిని మించిన తనయుడు. వ్యాస మహర్షి ఘృతాచి అనే అప్సరసకు జనించిన వారు. వేదవ్యాసుడు ఒకసారి అరణ్యంలో తపస్సు చేసుకుంటుండగా, అక్కడ ఒక అప్సరస ఘృతాచి అనే పేరుగల చిలుక (శుకము) రూపంలో సంచరిస్తూ కనిపించింది. ఆమెను చూసినప్పుడు వ్యాసుడికి కలిగిన సంకల్పం వల్ల, అరణి (యజ్ఞం కోసం వాడే కట్టె) నుండి ఒక దివ్యమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడు చిలుక ముఖ వర్చస్సుతో, దైవిక తేజస్సుతో జన్మించడం వల్ల ఆయనకు శుకుడు అని పేరు పెట్టారు.