Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారా? బ్రహ్మముహూర్తంలో..?
Varalakshmi Vratham 2026
వరలక్ష్మీ వ్రతం రోజున సింహ లగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరంగా సూచిస్తున్నారు. సింహలగ్న పూజ ముహూర్తం ఉదయం 6:10 - 08:28 వరకు వుంది. అలాగే ఉదయం 09.06 నుంచి 10.39 గంటల వరకు పూజకు ఉత్తమ సమయం అని పండితులు చెప్తున్నారు.
భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వరలక్ష్మీ వ్రతం దీపావళి పూజతో సమానమైన ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ఇంకా చారుమతి కథను చదవడం, కనకధారా స్తోత్రాన్ని పఠించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతం రోజున మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్ర పోకూడదు. వరలక్ష్మీ వ్రతం రోజున ఎవరితోనూ ఘర్షణలు పడకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి.
వర అంటే వరం. వరలక్ష్మి అష్టలక్ష్ముల (అష్టైశ్వర్యాల)ను ప్రసాదించే లక్ష్మీ స్వరూపం. ఆరోగ్యం, సంపద, సంతానం, ధైర్యం మొదలైనవి. వివాహిత స్త్రీలు భర్త దీర్ఘాయువు, కుటుంబ క్షేమం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. వరలక్ష్మిని పూజిస్తే అష్ట లక్ష్ములను పూజించినట్లే అంటారు. శ్రీ సూక్తం, వరలక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం.. హారతి, సుమంగళులకు ప్రసాదం వంటివి ఇవ్వడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.
