Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?
అసలే వేసవి కాలం. మజ్జిగ దొరికిందంటే చాలు గ్లాసులు గ్లాసులు తాగేస్తుంటారు చాలామంది. అలాంటి వారు మీరైతే.. మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగండి. ఆపై పొందే ఆరోగ్య ప్రయోజనాలు చూడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటో తెలుసుకుందాం. వేసవిలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే మజ్జిగలో అర స్పూన్ బ్లాక్ సాల్ట్ చేర్చి తీసుకోవచ్చు.
అలాగే వేసవిలో జుట్టు రాలిపోతుంటే మజ్జిగలో నల్ల ఉప్పును చేర్చి తీసుకోవడం ఉత్తమం. శరీరాన్ని డీ హైడ్రేషన్ కాకుండా వుండేందుకు మజ్జిగలో అరస్పూన్ బ్లాక్ సాల్ట్ చేర్చి తాగడం మంచిది. ఇంకా మజ్జిగలో బ్లాక్ సాల్ట్ కలిపి తాగడం ద్వారా వాత సంబంధిత రుగ్మతలు వుండవు.
చర్మ సమస్యలకు వేసవిలో చెక్ పెట్టాలంటే నల్ల ఉప్పును మజ్జిగలో కలిపి సేవించడం మంచిది. అసిడిటీని ఇది దూరం చేస్తుంది. ఇంకా జీర్ణ సంబంధిత రుగ్మతలకు మజ్జిగతో కలిసి బ్లాక్ సాల్ట్ చేర్చి తీసుకోవడం మంచిది.