మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. మొండిగా యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమ అధికం, ఫలితం శూన్యం. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. ప్రలోభాలకు లొంగవద్దు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణవిముక్తులవుతారు. ఖర్చులు విపరీతం. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. అప్రియమైన వార్త వినవలసివస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆహ్వానం అందుకుంటారు. సన్మాన సంస్మరణ సమావేశంలో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవకాశాలు కలిసివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. యత్నాలు కార్యరూపం దాల్చుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పనులు హడావుడిగా సాగుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు వెండి, బంగారం జాగ్రత్త.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కొత్తయత్నాలు మొదలెట్టండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పనులు సానుకూలమవుతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పొదుపు ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆప్తులతో సంభాషిస్తారు. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. దూరప్రయాణం తలపెడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. నిపుణుల సలహా తీసుకోండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యం సిద్ధిస్తుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. వాయిదాల చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు.