మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచించి ముందుకు సాగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని విధాలా యోగదాయకమే. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కొత్త యత్నాలు మెదలెడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. వాహనసౌఖ్యం, ధనలాభం ఉన్నాయి. దుబారా ఖర్చులు విపరీతం.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కలిసివచ్చే సమయం. నిరుత్సాహం వీడి శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ రోజు ఏమంత అనుకూలం కాదు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఖర్చులు అధికం. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధైర్యంగా ముందుకెడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. ఉత్సాహంగా శ్రమించండి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. బెట్టింగులకు పాల్పడవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యం నిశ్చమవుతుంది. ఖర్చులు విపరీతం. వాహనం కొనుగోలు చేస్తారు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలం. దీక్షతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. సలహాలు ఆశించవద్దు. వ్యతిరేకులు తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఆలస్యంగానైనా పనులు పూర్తి చేయగల్గుతారు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. మితంగా సంభాషించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. దూర ప్రయాణం సజావుగా సాగుతుంది.