మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. చేపట్టిన పనులు సాగవు. నోటీసులు అందుకుంటారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు. జూదాలు, బెట్టింగ్‌కు పాల్పడవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలం, అభీష్టం నెరవేరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిరక్ష్యంగా వదిలి వెళ్లకండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా వర్ణించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సంకల్పబలంతోనే లక్ష్యం సాధిస్తారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. ఆటంకాలెదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం, పసులు మందకొడిగా సాగుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ రోజు అనుకూలదాయకం. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. పెద్దల సలహా పాటిస్తారు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అభీష్టం నెరవేరుతుంది. ప్రతి విషయంలోను మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త మితంగా సంభాషించండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్య సాధనలో సఫలీకృతులవుతారు. ఒక సమస్య సద్దుమణుగుతుంది ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు, క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మొండిగా పనులు పూర్తి చేస్తారు. వేడుకలో అందరినీ ఆకట్టుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. అప్రియమైన వార్త ఉంటారు. ఏ విషయాన్నీ తేలికగా కొట్టివేయుద్దు వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ సమర్థతను తక్కువ అంచనా వేసుకోవద్దు. ఖర్చులు భారమనిపించవు. దంపతుల మధ్య అకారణ కలహం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా వేసుకుంటారు.