మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భేషజాలకు పోవద్దు. పెద్దల సలహా తీసుకోండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలు మొదలెడతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు అప్పగించవద్దు. ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1,2,3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకం. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అకారణ కలహం. మితంగా సంభాషించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్త వింటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ కృషి ఫలిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. పత్రాల రెన్యువల్, చెల్లింపుల్లో అలక్ష్యం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఒత్తిడికి గురికావద్దు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. పనుల్లో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్ని విధాలా అనుకూలమే. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. వివాహయత్నం ఫలిస్తుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు పురమాయించవద్దు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు కృషి ప్రధానం. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహించండి. స్వయంకృషితోనే కార్యం సాధ్యమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఓర్పు, ఏకాగ్రతతో మెలగండి. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతనం తగదు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధాకాదు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధనం మితంగా ఖర్చుచేయండి. ఆర్భాటాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. చేపట్టిన పనులపై శ్రద్ధ వహించండి. మీ ఏమరుపాటు ఇబ్బంది కలిగిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. రోజువారీ ఖర్చులుంటాయి. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి.