మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టపడి పనిచేసినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. దుబారా ఖర్చులు విషదేశం. పసులు ఒక పట్టాన సాగవు
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తల పెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త, పత్రాలు అందుకుంటారు. శుభకార్యంలో అందరిని ఆకట్టుకుంటారు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1,2,3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. సంతానప్రాప్తి, వాహనయోగం పొందుతారు. సన్నిహితులకు ధనసహాయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నేడు అనుకూలదాయకం, కార్యం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కష్టమనుకున్న సమాజం తేలికగా పూర్తవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తులు ఆంతర్యం గ్రహించండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్న విషయానికి చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పసులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
విశేష ఫంగాలున్నాయి. దక్ష్యాన్ని సాధిస్తాడు. నుండి బాడీలు ఖర్చులు నియంత్రించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితులను కలుసుకుంటారు. కొత్తవారితో మితంగా సంచారించండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. కొందరి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. బెట్టింగుల జోలికి పోవద్దు
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పనులు పురమాయించవద్దు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు.ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు..
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
స్థిరాస్తి ధనం అందుతుంది. రుణ సమస్య కొలిక్కి వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. మీ సామర్థ్యలపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు పురమాయించవద్దు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పత్రాల రెస్సువల్లో మార్పులు సాధ్యమవుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుకుంది. సమర్ధతను చాటుకుంటారు. అభీష్టం నెరవేరుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. పెద్ద ఖర్చు తగిలి ఆస్కారం ఉంది, దంపతుల మధ్య అకారణ కలహం. ఆత్మీయుల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. ఏకాగ్రతతో వాహనం నడవండి.