సోమవారం, 16 మార్చి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Modified: బుధవారం, 4 ఫిబ్రవరి 2026 (04:07 IST)

04-02-2026 బుధవారం రాశి ఫలితాలు, మీ కష్టం ఫలిస్తుంది

daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. పెట్టుబడులు కలిసిరావు. ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ముఖ్యులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు ధనసహాయం చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. కొత్త పనులు చేపడతారు. అనవసర జోక్యం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరులతో సంభాషిస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో శ్రమిస్తారు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక వుండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. బ్యాంకు రుణం మంజూరవుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులందుకుంటారు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మీ విజ్ఞత ఆకట్టుకుంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. అనవసరం బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కొంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్తపనులు మొదలుపెడతారు. అప్రమత్తంగా వుండాలి. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని సమస్యల నుంచి బైటపడతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం వుంటుంది. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిస్టాలను సున్నితంగా తెలియజేయండి. పనులు హడావుడిగా సాగుతాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. మొండిబాకీలు వసూలవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా వుండవు. రావలసిన ధనానని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఊహించని ఖర్చులెదురవుతాయి. ఆత్మీయులు ఆదుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. శుభకార్యంలో పాల్గొంటారు.