శనివారం, 18 ఏప్రియల్ 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉండాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలకు దీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. చురుకుగా సాగుతాయి. ఖర్చులు ప్రయోజనకరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు సామాన్యం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలలో తీరిక ఉండదు. ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఇతరుల బాధ్యతలు చేపట్టి, అవస్థలెదుర్కుంటారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు విపరీతం. తెలియని వెలితి వెంటాడుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఖర్చులు విపరీతం, అవసరాలు నెరవేరుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణం విరమించుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. లావాదేవీలతో సతమతమవుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే. జరుగుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో శ్రమించండి. ఇతరులను సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం, పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. ఆర్ధికంగా బాగుంటుంది. ధనసహాయం తగదు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులను మీ విషయాల్లో జోక్యం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. సర్వదా అనుకూలం. మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుగారు.. కష్టమనుకున్న పసులు తేలికగా పూర్తవుతాయి. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సమర్థతపై నమ్మకం సన్నగిల్లుతుంది. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.