సోమవారం, 2 మార్చి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 25 జనవరి 2026 (10:26 IST)

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు పురమాయించవద్దు. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు అధికం. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పోటీల్లో విజయం సాధిస్తారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సాధిస్తారు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ శ్రీమతి మాటతీరు అసహనం కలిగిస్తుంది. దూరప్రయాణం విరమించుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పొదుపుదనం గ్రహిస్తారు. పనుల్లో చికాకులు అధికం. వేడుకకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పట్టుదలతో శ్రమిస్తేనే పనులు సానుకూలమవుతాయి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఖర్చులు విపరీతం. పరిచయుస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఖర్చులు తగ్గించుకుంటారు. ధనసహాయం తగదు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులు మీ సమర్ధతను గుర్తిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు త్వరితగతిన సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ కొత్త యత్నాలు మొదలెడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. మీ కష్టం వెంటనే ఫలిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ముఖ్యులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పువస్తుంది. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వేడుకకు హాజరవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.