సంబంధిత వార్తలు
- 20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...
- 19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...
- 18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...
- 17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...
- 16-01-2026 శుక్రవారం ఫలితాలు - పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...
22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. ఖర్చులు సామాన్యం, నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవంతరాలు ఎదురవుతాయి. ముఖ్యల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆత్మీయుల సలహా పాటిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. పనుల్లో ఒత్తిడి అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పసులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నేడు అనుకూలదాయకం. ధైర్యంగా యత్నాలు సాగించండి. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాలు చెల్లింపులో అలక్ష్యం తగదు. సంప్రదింపులు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నొప్పించవద్దు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు తప్పవు. పట్టుదలతో ముందుకు సాగండి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దీర్ఘకాలిక సమస్య కొలిక్కి వస్తుంది. తాకట్టు విడిపించుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని పనులతో జాగ్రత్త. మీ నుంచి విషయాన్ని రాబట్టేందుకు కొందరు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు సాగుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు, కొత్త బాధ్యతలు . స్వీకరిస్తారు. లావాదేవీలతో తీరిక వుండదు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల్లో ఒత్తిడి, శాస్త్రం అధికం ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిరాశపరుస్తాయి. రావలసిన రహన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. వసూళ్లు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల ఇంటర్వూ అనుకూలించదు. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం చేసి భంగపడతారు. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. సావకావంగా పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. అర్ధాంతంగా అగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. కొత్త పరిచయాలేర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం, ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.
