1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 20-01-2025 Daily Astrology

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

rishabham
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఎదుటివారికి మీ సమర్థతపై గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అందుపులో ఉండవు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో మంచి ఫలితాలున్నాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. దుబారా ఖర్చులు విపరీతంప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నేడు ఆశాజనకం. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పరధ్యానంగా ఉంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. శ్రమించినా ఫలితం ఉండదు. దంపతుల మధ్య అకారణ కలహం. బంధువుల వైఖరి కష్టమనిపిస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పత్రాలు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. అప్రియమైన వార్త వింటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
About Writer
రామన్
తర్వాతి కథనం
22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..