మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తప్పటడుగు వేస్తారు. అంచనాలు ఫలించవు. మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ప్రియతములతో సంభాషిస్తారు. కొత్తయత్నాలు మొదలెడతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూలతలున్నాయి. రుణ సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. శ్రమకు తగిన ఫలితాలున్నాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త, అతిగా శ్రమించవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కలిసివచ్చే సమయం. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. సావకాశంగా పనులు పూర్తిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రయాణంలో చికాకులెదుర్కుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. రోజువారీ ఖర్చులుంటాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్ధికంగా ఆశించిన ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆత్మీయులను కలుసుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమయస్ఫూర్తితో మెలగాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. పనులు అర్థాంతగా ముగిస్తారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఖర్చులు సామాన్యం. మితంగా సంభాషించండి. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాసాలకు వ్యయం చేస్తారు. స్థిమితంగా పనులు పూర్తవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నోటీసులు అందుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.