మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పబలంతో కార్యం సాధిస్తారు. మీ సామర్ధ్యాలపై నమ్మకం కలుగుతుంది. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీదైన రంగంలో అనుభవం గడిస్తారు. లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆశించిన పదవి దక్కదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నేడు కలిసివచ్చే సమయం. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కుంటారు. మీ కార్యదీక్ష ఆకట్టుకుంటుంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. మీ సామర్ధ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. అతిగా ఆలోచింపవద్దు. పొదుపు ధనం గ్రహిస్తారు. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆప్తులకు మీ సమస్యలను తెలియజేయండి. దంపతుల మధ్య సఖ్యతలోపం. పట్టుదలకు పోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
స్థిరచరాస్తి మూలక ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. ఖర్చులు విపరీత. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పనులు సాగవు. ప్రముఖులను సంప్రదిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రముఖులకు సన్నిహితులవుతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. ప్రయాణం విరమించుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఒప్పదాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ఖర్చులు అధికం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. నోటీసులు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ పనితీరు ప్రశంనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు. విందుకు హాజరవుతారు.