గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-01-2026 ఆదివారం ఫలితాలు - అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు...

horoscope
dమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. కీలక బాధ్యతలు చేపడతారు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆచితూచి అడుగేయాలి. మితంగా సంభాషించండి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు మెరుగైన ఫలితాలిస్తాయి. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులతో సతమతమవుతారు. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఖర్చులు సామాన్యం. పనుల్లో ఒత్తిడి అధికం. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతిలోపం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పిల్లల దూకుడు అదుపు చేయండి. నోటీసులు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు అర్ధాంతంగా నిలిపివేస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కలిసివచ్చే సమయం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. పోటీల్లో గెలుపొందుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సన్నిహితుల సలహా పాటించండి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితోను సౌమ్యంగా మాట్లాడండి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు ఒక పట్టాన సాగవు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ వాక్కు ఫలిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.