శుక్రవారం, 6 మార్చి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-01-2026 గురువారం ఫలితాలు - పనులు మొండిగా పూర్తిచేస్తారు...

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆచితూచి అడుగేయండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ధార్మికతపై ఆసక్తి కనబరుస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. కీలక అంశాలపై దృష్టి పెడతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. చేసిన పనులు మొదటికే వస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. లౌక్యంగా బాకీలు రాబట్టుకోవాలి. ముఖ్యుల కలయిక వీలుపడదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధి ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాట నిలబెట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఉల్లాసంగా గడుపుతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ముగ్గుల పోటీల్లో మహిళలు గెలుపొందుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. దైవకార్యంలో పాల్గొంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. తప్పటడుగువేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. అప్రమత్తంగా ఉండాలి. అనుకున్న మొక్కులు చెల్లించుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు చురుకుగా సాగుతాయి. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. మీ చొరవతో ఒకరికి మంచి జరుతుంది. ఎడ్లపందాలు, క్రీడాపోటీల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దూకుడుగా వ్యవహరిస్తారు. మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు వేగవంతమవుతాయి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు సాగవు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. దూరప్రయాణం తలపెడతారు.