ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-03-2026 సోమవారం ఫలితాలు : కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం...

rishabham
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ ఇబ్బందులను ఆప్తులకు తెలియజేయండి. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కలిసివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. ఖర్చులు అధికం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాస్థితి అనుకూలంగా. ఇష్టపడి శ్రమించి లక్ష్యం సాధిస్తారు. లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. (ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. పొగడ్తలకు పొంగిపోవద్దు. సన్నిహితులను కలుసుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీదైన రంగంలో శుభపరిణామాలున్నాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. కొత్త యత్నాలు చేపడతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పరిచయస్తుల రాక చికాకుపరుస్తుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆశావహదృక్పధంతో మెలగండి. పట్టుదలతో శ్రమిస్తే కార్యం సిద్ధిస్తుంది. సాయం ఆశించవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులుంటాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్తయత్నాలు చేపడతారు. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు, పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు సామాన్యం. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు పురమాయించవద్దు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆప్తులతో సంభాషిస్తారు. నోటీసులు అందుకుంటారు.