మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, అకాల భోజనం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పందాలు, బెట్టింగుల జోలికిపోవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. రావలసిన ధనం సమయానికి అందదు. బాధ్యతలు అప్పగించి అవస్థపడతారు. ప్రముఖులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయుల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒంటెద్దు పోకడ తగదు. నిపుణులను సంప్రదించండి. మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. అవకాశాలు చేజారిపోతాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంకల్పబలంతో అడుగు ముందుకేస్తారు. అదృష్టయోగం ఉంది. ఆకస్మికంగా అవకాశాలు కలిసివస్తాయి. కొత్త పనులు చేపడతారు. దుబారా ఖర్చులు అధికం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సమయస్ఫూర్తితో మెలగండి. పొగడ్తలకు పొంగిపోవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యలను కలిసినా ఫలితం ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆత్మీయుల రాక మనోధైర్యాన్నిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభవార్త వింటారు. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహస్థితి సామాన్యంగా ఉంది. ఆచితూచి అడుగేయండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు విపరీతం. నిస్తేజానికి లోనవుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆచితూచి అడుగేయండి. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. సంకల్పబలంతో ముందుకు సాగండి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలపై దృష్టి పెట్టండి. తొందరపాటు నిర్ణయం తగదు. నిపుణులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.