1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 28-02-2026 Your Daily Horoscope

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆశావహదృక్పథంతో శ్రమించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. దైవకార్యానికి వ్యయం చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. స్నేహసంబంధాలు వెల్లివిరుస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. మీ కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అందరితోను మితంగా సంభాషించండి. రాజీమార్గంలో వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు, సంకల్పబలమే విజయానికి దోహదపడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. పత్రాలు అందుతాయి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు మెరుగుపరతాయి. మీ కష్టం ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆత్మీయులు ఉత్సాహపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ శ్రీమతి తీరులో మార్పు వస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే చిరాకుపడుతారు. మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం. ఖర్చులు తగ్గించుకుంటారు. ముఖ్యుల ఇంటర్వూ వీలుపడదు. పనులు ముందుకు సాగవు. వాహనదారులకు దూకుడు తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభవార్త వింటారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీదైన రంగంలో రాణిస్తారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు మెరుగుపడతాయి. కార్యం నెంచేసుకుంది, ఉత్సాహంగా కొత్త పనులు చేపడతారు. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. పెట్టుడంతో మరోసారి ప్రయత్నించండి. ఖర్చులు అతకం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలనుపుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంపై దృష్టిపెడతారు. ప్రియతములను కలుసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల విషయాలు, నగదు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆలయాలు సందర్శిస్తారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు ఫలిస్తాయి. తగిన నిర్ణయం తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త, ఇతరులను ఓ కంట కనిపెట్టండి. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి.
About Writer
రామన్
తర్వాతి కథనం
TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ