1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 23-02-2026 Your Daily Horoscope

23-02-2026 సోమవారం ఫలితాలు : ఖర్చులు అధికం.. పొదుపు ధనం స్వీకరిస్తారు...

rashiphal
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పరిస్థితులకు తగినట్లుగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పనుల్లో శ్రమ అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఓర్పుతో మెలగండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహమరమ్మతులు చేపడతారు. చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. లక్ష్యం సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. సమయానుకూలంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. ఖర్చులు అధికం. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దలను సంప్రదించండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఖర్చులు సామాన్యం. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. చేపట్టిన కార్యం త్వరలో సాధ్యమవుతుంది. ఆశావహదృక్పధంతో మెలగండి. స్థిరాస్థి ధనం అందుకుంటారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సాగవు. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా యత్నాలు సాగించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆదాయం సంతృప్తికరం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. అపరిచితులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. ఇతరులను మీ దరికి చేరనీయవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నేడు కొంతమేరకు అనుకూలమే. కొన్ని సమస్యలు తొలగుతాయి. సమయస్ఫూర్తితో మెలుగుతారు. పనులు సావకాశమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆత్మీయుల సాయం అందుతుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. వ్యవహారంలో తొందరపాటు తగదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం ఆశించి భంగపడతారు. అవపరాలు నెరవేరవు. కొత్త యత్నాలు చేపడతారు. నోటీసులు అందుకుంటారు. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మనోభీష్టం నెరవేరుతుంది. ప్రతికూలతలు తొలగుతాయి. ఉత్సాహంగా శ్రమించండి. పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఖర్చులు అధికం. పొదుపు ధనం గ్రహిస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
About Writer
రామన్
తర్వాతి కథనం
24-02- 2026 మంగళవారం ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు