సంబంధిత వార్తలు
- 21-02-2026 శనివారం ఫలితాలు : నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...
- 20-02-2026 శుక్రవారం ఫలితాలు : ఖర్చులు సామాన్యం.. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...
- 19-02-2026 గురువారం ఫలితాలు : పొగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు...
- 18-02-2026 బుధవారం ఫలితాలు - ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు....
- 17-02- 2026 మంగళవారం ఫలితాలు - మీ తప్పిదాలు సరిదిద్దుకోండి
22-02-2026 ఆదివారం ఫలితాలు : రోజువారీ ఖర్చులే ఉంటాయి.. చెల్లింపుల్లో జాప్యం తగదు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కష్టం వృధా కాదు. శ్రమించే కొద్దీ ఫలితాలుంటాయి. ఆశావహదృక్పధంతో మెలగండి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నిర్దేశిత లక్ష్యం రూపొందించుకుంటారు. అవకాశాలను అందిపుచ్చుకోండి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. నిపుణుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. మిత్రుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలను వదులుకోవద్దు. సొంత నిర్ణయాలు తగవు. ఆచితూచి అడుగేయండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. సాయం ఆశించి భంగపడతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి గురవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఫైనాన్సురంగాలకు దూరంగా ఉండండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలు మొదలెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మొదలెట్టిన పనులు మధ్యలో నిలిపివేయొద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆత్మస్థైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు, పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమవుతారు. ఓర్పుతో మెలగండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారజయం ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక వ్యవహారంపై పట్టు సాధిస్తారు. అన్నిటా మీదే పైచేయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి.
