1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 21-02-2026 Your Daily Horoscope

21-02-2026 శనివారం ఫలితాలు : నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. నోటీసులు అందుకుంటారు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి సామన్యం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. పెద్దల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు అధికం. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా విశేష ఫలితాన్నాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పొదుపు ధనం అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. సన్నిహితులతో సంభాషిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారంలో తొందరపాటు తగదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయి. ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. ఖర్చులు విపరీం. చీటికి మాటికి అసహనం చెందుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. సంతోషకరమైన వార్త వింటారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధువులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ధనసహాయం తగదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వేడుకకు హాజరవుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త సమస్యలెదురయ్యే సూచనాలున్నాయి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దుబారా ఖర్చులు విపరీతం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ఫలిస్తాయి. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త పనులు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది.
తర్వాతి కథనం
20-02-2026 శుక్రవారం ఫలితాలు : ఖర్చులు సామాన్యం.. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...