1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 16-02-2026 Your Daily Horoscope

16-02-2026 సోమవారం ఫలితాలు - మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు...

daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. రోజువారీ ఖర్చులుంటాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. అనవసర జోక్యం తగదు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఉత్సాహం తగ్గకుండా శ్రమించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. విలాసాలకు ఖర్చుచేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. పరిచయస్తులతో విభేదాలు తలెత్తుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ముఖ్యం. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. మీ శ్రీమతి సాయంతో ఒక అవసరం నెరవేరుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అప్రమత్తంగా ఉండాలి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయ సేకరణకు కొందరు యత్నిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు విజయపథంలో సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆపన్నులకు సాయం చేస్తారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పొగిడే వారితో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. పాతమిత్రులను కలుసుకుంటారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నేడు అనుకూలదాయకం. మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. స్థిరచరాస్తుల ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు, వ్యాపకాలు అధికమవుతాయి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహబలం ప్రతికూలంగా ఉంది.. అవకాశాలు చేజారిపోతాయి. చిన్న విషయానికే చికాకుపడుతుంటారు. పనులు అప్పగించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిపెడతారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. కీలక పత్రాల్లో మార్పులు సాధ్యపడతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రావలసిన ధనం సమయానికి అందుతుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని విధాలా అనుకూలమే. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పొదుపు ధనం అందుకుంటారు. ఆప్తులను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణంలో కొత్తవ్యక్తులతో జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీదైన రంగంలో పురోగమిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
About Writer
రామన్
తర్వాతి కథనం
ఏఐతో ఇబ్బందులు తప్పవ్.. బాబా వంగా జోస్యం