1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 15-02-2025 Daily Astrology

15-02-2026 ఆదివారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు

astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పంతాలు, భేషజాలకు పోవద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. లావాదేవీలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఖర్చులు అధికం. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్తవ్యక్తులను దరిచేరనీయవద్దు. ఆశించిన పదవి దక్కదు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. నిరుత్సాహానికి గురికావద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆటంకాలెదురైనా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నేడు అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. బాకీలు వసూలవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. కొత్త పనులకు చేపడతారు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. ప్రలోభాలకు లొంగవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయగల్గుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. ఒప్పందాల్లో సమయస్ఫూర్తిగా మెలగండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనపం మనోదానికి ఖర్చుచేస్తారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ధృఢసంకల్పంతోనే లక్ష్యం సాధిస్తారు, బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహబలం అనుకూలంగా ఉంది. ఆటంకాలెదురైనా మీ కృషి ఫలిస్తుంది. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యం విజయవంతమవుతుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా అడుగులేస్తారు. అనుకున్న ఖర్చులే ఉంటాయి. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. అనవసర జోక్యం తగదు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. పెద్దమొత్తం సహాయం తగదు. మీ అశక్తతను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆహ్వానం అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ ఓర్పునకు పరీక్షా సమయం. సంకల్పబలంతో యత్నాలు సాగించండి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. 
About Writer
రామన్
తర్వాతి కథనం
16-02-2026 సోమవారం ఫలితాలు - మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు...