1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. panchabutha trees: vinayaka worship significance and its benefits

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

vinayaka worship
vinayaka worship
ఆదివారం పూట రావిచెట్టు కింద వున్న విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. విఘ్నేశ్వరుడిని ఓ చిన్నపాటి గరికెను సమర్పించి ప్రార్థిస్తేనే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలా పంచభూత వృక్షాల కింద కొలువై వున్న వినాయకుడిని పూజిస్తే సర్వదా శుభం కలుగుతుంది. ఆ వృక్షాలేంటో చూద్దాం. 
 
కొన్ని వృక్షాలను పంచభూత శక్తులను కలిగివుంటాయి. అవేంటంటే.. రావిచెట్టు - ఆకాశాన్ని సూచిస్తుంది. వాతనారాయణ వృక్షం - వాయువు అంటే గాలిని సూచిస్తుంది. వన్ని వృక్షం అంటే అగ్నిని సూచిస్తుంది. ఉసిరి చెట్టు- నీటిని జలాన్ని సూచిస్తుంది. అలాగే మర్రి చెట్టు భూమికి సంకేతంగా నిలుస్తుంది. ఈ వృక్షాలను పూజించడం ద్వారా కర్మ ఫలితాలను దూరం చేస్తాయి. అలాంటి వృక్షాల కింద కొలువై వుండే విఘ్నేశ్వరుడిని పూజిస్తే నవగ్రహ దోషాలు తొలగిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
రావి చెట్టు కింద వినాయకుడు - అశ్వత్థ వినాయకుడు
రావి చెట్టును అశ్వత్థం అని కూడా పిలుస్తారు. రావి అత్యంత పవిత్రమైన వృక్షంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివ అనే త్రిమూర్తుల శక్తి రావి చెట్టులో నివసిస్తుందని ఆగమ శాస్త్రం చెప్తోంది. రావి చెట్టు నీడలో కూర్చున్న వినాయకుడిని పూజిస్తే, కర్మ దోషాలు తొలగిపోతాయి. మానసిక బాధలు తగ్గుతాయి. సంతానం కావాలని కోరుకునే వారు భక్తితో ప్రార్థించడం చాలా శుభకరంగా భావిస్తారు.
 
జమ్మి చెట్టు కింద వినాయకుడు - వన్ని వినాయకుడు
జమ్మి చెట్టు విజయానికి చిహ్నంగా కొనియాడబడుతుంది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాస సమయంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టులో దాచిపెట్టారు. కాలం వచ్చినప్పుడు వాటిని తిరిగి తీసి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు.
 ఈ చరిత్ర కారణంగా జమ్మి చెట్టును విజయానికి గుర్తుగా పూజిస్తారు. జమ్మి చెట్టు కింద ఉన్న వినాయకుడిని పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యమైన పనుల్లో విజయం కోసం భగవంతుడిని ప్రార్థించవచ్చు. కుటుంబ ఐకమత్యం మరియు మానసిక దృఢత్వం పెరగడానికి ప్రార్థనలు చేస్తారు.
 
3. మారేడు చెట్టు కింద వినాయకుడు - బిల్వ వినాయకుడు
మారేడు ఆకు శివుడికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే మారేడు చెట్టు కింద కొలువైన వినాయకుడిని శివ స్వరూపంగా భావిస్తారు. చతుర్థి రోజున భక్తితో ఈయనను పూజించి, అన్నదానం లేదా బియ్యం, పప్పు వంటి వస్తువులను అవసరమైన వారికి దానంగా ఇచ్చి, మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుందని చాలామంది మొక్కుకుంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగడానికి భగవంతుడిని ప్రార్థిస్తారు. 
 
మర్రి చెట్టు కింద వినాయకుడు - వట వినాయకుడు
మర్రి చెట్టు దీర్ఘాయుష్షుకు, స్థిరమైన జీవితానికి సంకేతం. మర్రి చెట్టు కింద ఉన్న వినాయకుడిని పూజిస్తే శారీరక  మానసిక ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కోసం భక్తులు పూజిస్తారు. మనశ్శాంతి, ఓర్పు, ఆధ్యాత్మిక అభివృద్ధి కలగాలని భగవంతుడిని వేడుకుంటారు. 
 
వేప చెట్టు కింద వినాయకుడు - నింబ వినాయకుడువేప చెట్టును పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. వేప చెట్టు కింద ఉన్న వినాయకుడిని పూజిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోవాలని చాలా మంది మొక్కుకుంటారు. మంచి జీవిత భాగస్వామి లభించాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలని మొక్కులు చెల్లిస్తారు.
 
ఉసిరి చెట్టు కింద వినాయకుడు - ఆమ్లక వినాయకుడు
ఉసిరి చెట్టు లక్ష్మీ కటాక్షానికి చిహ్నంగా భావిస్తారు. ఈ చెట్టు కింద ఉన్న వినాయకుడిని పూజిస్తే కుటుంబంలో సంపద కోసం ప్రార్థిస్తారు. సంతానం కావాలని కోరుకునే వారు భక్తితో పూజిస్తారు. ఆడ సంతానం కావాలని కోరుకునే వారు ఉసిరి చెట్టు కింద వినాయకుడిని పూజించడం విశేషంగా చెప్పబడింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?