తిరుమలలో చైన్ స్నాచర్.. మహిళా భక్తురాలు బంగారు గొలుసును లాక్కెళ్లాడు..
తిరుమలలోని ఒక రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళా భక్తురాలి మెడలోని బంగారు గొలుసును ఒక వ్యక్తి లాక్కెళ్లాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన సురేష్ కుమార్‌గా గుర్తించారు. శ్రీవారి మెట్టు నడక మార్గం సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేరానికి సంబంధించి అతడిని విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
