చైనా పీస్ కు యా/ఏ సర్టిఫికెట్, సెప్టెంబర్‌లో రిలీజ్
Nihal Kodati, Surya Srinivas,
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఇంతకుముందు 'చైనా పీస్' పేరుతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిత్రం, ఇప్పుడు 'సీక్రెట్ సోల్జర్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) యూ/ఏ 16+ సర్టిఫికెట్ జారీ చేసింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేశారు.
