1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Weekly Horoscope, August 2-8, 2026

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

How is this week going to be?
Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ధనసహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రులు ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్నివిధాలా యోగదాయకమే. పరిస్థితులు మెరుగుపడతాయి. కార్యసిద్ధి, వ్యవహారజయం ఉన్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి, మంగళవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సమయపాలన ముఖ్యం. బెట్టింగ్ల జోలికి పోవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. శుక్రవారం నాడు ఆచితూచి అడుగేయండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు. ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై గురికుదురుతుంది. ప్రతి విషయంలోను ధైర్యంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు. పురమాయించవద్దు, ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులకు హోదామార్పు, నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి ఏమంత అనుకూలం కాదు. ఆచితూచి అడుగువేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆదివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విదేశాల నుంచి సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారిపోతాయి. ఆదాయం నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు, వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. గురువారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. ముఖ్యమైన పనులు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా అడుగులేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం, ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. రుణవిముక్తులవుతారు. పనులు సానుకూలమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కురుటపడతారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారాలు పుంజుకుంటాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యసిద్ధిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ సమస్యను సన్నిహితులకు తెలియజేయండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రైవేట్ ఉద్యోగులకు మార్పులు అనివార్యం. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. మీ కష్టం వేరొకరికి లాభిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానానికి మంచి ఫలితాలున్నాయి. తరచు ఆప్తులతో సంభాషిస్తారు. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
ఈ వారం ఆచితూచి అడుగేయాల్సిన సమయం, వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ నిర్ణయం వాయిదా వేయటం శ్రేయస్కరం. పనులు మొదలెట్టేసరికి ఆటంకాలెదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానులిచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు, ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో కూడిన బదిలీ, ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. జూదాలు, బెట్టింగ్ల జోలికి పోవద్దు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...