31-07-2026 శుక్రవారం ఫలితాలు- దంపతుల మధ్య స్వల్ప కలహాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. దంపతుల మధ్య స్వల్ప కలహాలు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఆప్తులకు సాయం అందిస్తారు. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. మీ ఏమరుపాటుతనం ఇబ్బంది కలిగిస్తుంది. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. రుణ సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంకల్పబలంతో చేసే యత్నం ఫలిస్తుంది. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. ముఖ్యుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వాహనం అమర్చుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అనవసర విషయాల జోలికి పోవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతతారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. కొత్తయత్నాలు మొదలెడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆచితూచి అడుగు వేయండి. అర్థాంతంగా నిలిచిన పనులు పూర్తిచేస్తారు. రావలసిన ధనం అందుతుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య కలహం. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగుతుంది. ఖర్చులు సంతృప్తికరం. అందరితోను మితంగా సంభాషించండి. ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. బంధువులతో సంభాషిస్తారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. ఒత్తిడికి గురికావద్దు. మీ యత్నాలకు సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహరాల్లో తొందరపాటు తగదు. నిపుణులను సంప్రదించండి. పనులు హడావుడిగా సాగుతాయి. ధనసహాయం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. రాజీమార్గంలో వివాదాలు పరిష్కరించుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. లక్ష్యానికి చేరువవుతారు. పనుల సానుకూలతకు కృషి ప్రధానం. కొత్త సమస్య లెదురయ్యే సూచనలున్నాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
