1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Srisailam Temple: Online Booking Disrupted, Endowments Dept To Take Action

Srisailam Temple: శ్రీశైలం ఆన్‌లైన్ బుకింగ్‌లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం

Srisailam
సాంకేతిక సమస్యల నేపథ్యంలో, శ్రీశైలం ఆలయ వెబ్‌సైట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న '9 అండ్ 9' సంస్థపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంటూ ఆంక్షలు విధించింది. 2021 నుండి ఈ సంస్థ ఆలయ వెబ్‌సైట్, ఆన్‌లైన్ టికెట్ జారీ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇటీవల టికెట్ బుకింగ్‌లో తలెత్తిన అంతరాయాలను పరిగణనలోకి తీసుకుని, సదరు సంస్థ కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలని అధికారులు నిర్ణయించారు. 
 
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, టీఎంఎస్ అనే మరో సంస్థ ద్వారా టికెట్ల జారీకి ఏర్పాట్లు చేస్తూ, త్వరలోనే ఆ కొత్త సంస్థ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌లను పునరుద్ధరించాలని శాఖ భావిస్తోంది. అయితే, బాధ్యతలను తిరిగి టీఎంఎస్‌‌కు అప్పగించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టీఎంఎస్ టికెట్ల జారీని నిర్వహించినప్పుడు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఈ విషయంపై దేవాదాయ శాఖ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.