27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కీలక వ్యవహారంపై పట్టుసాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. కార్యసిద్ధికి ఓర్పు ముఖ్యం. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ఫైనాన్స్ జోలికి పోవద్దు. పనులు ఒకపట్టాన పూర్తికావు. చీటికిమాటికి చికాకుపడుతుంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ మాటతీరు కొందరికి మనస్తాపం కలిగిస్తుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాఫల్యతకు ఓర్పు ప్రధానం. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపులను అశ్రద్ధ చేయకండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజం కలిగిస్తాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ కృషికి అదృష్టం తోడవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉత్సాహంగా శ్రమించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనలాభం ఉంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. విందులకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1 పాదం
కొంతమేరకు అనుకూలం. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పొగడ్తలు, ప్రలోభాలకు లొంగవద్దు. పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా పూర్తిచేయగల్గుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. కొందరి వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. ఆశావహదృక్పధంతో మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
