1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Your Weekly Horoscopes: July 26-August 1, 2026

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Weekly Horoscope
Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం, కీలక ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞుల సలహాతో పాటించండి. ఆదాయం బాగుంటుంది. రోజు వారి ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుక్రవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. మీ చొరవతో ఒక సంబంధం నిశ్చయమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రశీదులు, మఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. సోసువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు గురికావద్దు. ఆహ్వనం అందుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొత్త పథకాలు చేపడతారు. పెద్దమొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. ఇతరులు కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండి ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభం. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం తప్పదు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్ని తేలికగా భావించవద్దు. పరిస్థితులు నిదానంగా కుదుటపడతాయి. ఆత్మీయుల సలహా పాటించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. శనివారం నాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహనలోపం ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. గృహమార్పు కలిసివస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. సరుకు నిల్వల్లో జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహాల సంచారం బాగుంది. అన్ని విధాలా కలిసివచ్చే సమయం. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ధనలాభం ఉంది. వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులపై దృష్టిసారించండి. యాధృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. మంగళవారం వారు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతల వారి తాహదును క్లుణ్ణంగా తెలుసుకోండి. సంతానం దూకుడు అదుపుచేయండి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కలు వెంటనే తీర్చుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. స్థిరచరాస్తుల ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆదివారం నాడు ఏ పని చేయబుద్ధి కాదు. అయిన వారితో కాలక్షేపం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయనిపుణులను ఆశ్రయిస్తారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఒప్పందాల్లో జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. విజ్ఞతతో మెలుగుతారు. గౌరవమర్యాదలు పెంపొందుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం ఆలయాలకు విరాళాలు అందిస్తారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బందికి దారితీస్తుంది. సన్నిహితులతో తరచు సంభాషిస్తుంటారు. ముఖ్యమైన వ్యవహారం మీ సమక్షంలో సాగుతుంది. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. కీలక పత్రాల్లో సవరణలు అనివార్యం. అవివాహితులకు వివాహయోగం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఎందుకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తారు. మొండిబాకీలు వసూలవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం, సామరస్యంగా మెలగండి. పంతాలకు పోవద్దు. ఆప్తుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద వ్యాపారులకు నిరాశాజనకం. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. సంప్రదింపులతో తీరిక ఉండదు. విశ్రాంతి లోపం. అకాలభోజనం, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. ఒంటెద్దు పోకడ తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. న్యాయ, సేవా రంగాల వారికి ఆయాభివృద్ది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే చికాకుపడుతారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. మనసుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. సోమవారం వాడు ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. పట్టింపులకు పోవద్దు. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. కొత్తయత్నాలు చేపడతారు. ఆహ్వనం అందుకుంటారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. వ్యాపారాలు నిరాశాజనకం. పెద్దవ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు, బిల్డర్లకు ఒత్తిడి, చికాకులు అధికం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆయన వారితో ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. గురువారం నాడు నగదు, కీలక పత్రాలు జాగ్రత్త, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ జోక్యం అనివార్యం. సంతానం దూకుడును అదుపు చేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వ్యతిరేకులతో మితంగా సంభాషించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, ఉద్యోగస్తులకు పనిభారం. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. చేతివృత్తుల వారికి ఆశాజనకం.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రేమానుబంధాలు బలపడతాయి. విజ్ఞతతో మెలుగుతారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వివరీతంగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుయి. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ప్రతి విషయంలోని ఆచితూచి అడుగేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయపాలన ముఖ్యం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు