16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బుధవారం నాడు ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్తయత్నాలు చేపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. మీ చొరవతో వివాదం సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వెండి బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆశావహదృక్పధంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ప్రయాణం కలిసివస్తుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. కొత్తపనులకు శ్రీకారం చుడతారు. సోమవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. రావలసిన ధనం అందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పత్రాలు అందుకుంటారు. ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు, పనియందు ధ్యాస ప్రధానం. వస్త్రవ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. దైవకార్యం, విందుకు హాజరవుతారు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. ధనయోగం ఉంది. రుణసమస్య నుంచి విముక్తులవుతారు. ఖర్చులు భారమనిపించవు. వస్త్రాలు, వెండి బంగారం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. చేపట్టిన పనులు ప్రశాంతంగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం యోగదాయకం. శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పధంతో శ్రమించండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురువారం నాడు అనుకోని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. ఒంటెద్దు పోకడ తగదు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు ఉల్లాసం కలిగిస్తాయి. గృహమార్పు అనివార్యం. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. నిపుణుల సలహా పాటించండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. న ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చుచేస్తారు. సోమవారం నాడు ఏ పనీ సాగదు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధుమిత్రులతో తరచు సంభాషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. విందులు, వేడుకకు హాజరవుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకెళతారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గురువారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. మీ శ్రీమతి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. అవివాహితులకు శుభదాయకం. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాతలు యధావిధిగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కార్యసిద్ధి, ధనప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శనివారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్ధం చేసుకుంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. చిన్ననాటి గురువులను కలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రయాణం కలిసివస్తుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ధైర్యంగా అడుగులేస్తారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆదివారం నాడు ముఖ్యుల ఇంటర్వ్యూ అనుకూలించదు. న పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. అధికారులకు స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆచితూచి అడుగేయండి. కొత్త సమస్యలెదురయ్యే ఆస్కారం ఉంది. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. ఏ విషయాన్నీ తేలికగా కొట్టివేయెద్దు. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నోటీసులు అందుకుంటారు. మంగళవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో డబ్బు నిలవదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉపాధిపథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సన్నిహితుల చొరవతో ఒక సమస్య తొలగుతుంది. వివాహయత్నాలకు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. గురువారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయం అంతంత మాత్రమే. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహనలోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. పెద్దల చొరవతో ఒక వివాదం సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కీలక పత్రాలు అందుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
