12-07-2026 నుంచి 18-07-2026 వరకు మీ వార ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సోమవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్తపనులు చేపడతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలించదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. న్యాయవాదులు, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. లైసెన్సుల రెన్యువల్లో జాప్యం తగదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మంగళవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. కీలక వ్యవహారాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు సరిదిద్దుకుంటారు. సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నింంచడి. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు తగ్గించుకుంటారు. బుధవారం నాడు కొత్త సమస్య తలెత్తుతుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆశావహదృక్పధంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధి పథకాలు చేపడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరవు. ముఖ్యమైన చెల్లింపుల్లో జాప్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసివస్తుంది. శుక్రవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. బిల్డర్లకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అర్థాంతంగా ముగించిన పనులు పునఃప్రారంభిస్తారు. ఆదివారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య స్వల్ప కలహం. సంయమనం పాటించండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో కాలక్షేపం చేస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల పదోన్నతి, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్నింటా మీదే పైచేయి. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. మీ . వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పెద్దల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. వేడుకలు, వినోదాల్లో దూకుడు తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ కష్టం ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారంలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఆహ్వానం అందుకుంటారు, దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ముఖ్యమైన చెల్లింపుల్లో అలసత్వం తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురికుదురుతుంది. సంప్రదింపులకు అనుకూలం. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు గురికావద్దు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఆందోళన కలిగిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు అంకితభావం ముఖ్యం.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాల్సిన సమయం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. గురువారం నాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆశావహదృక్పధంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఓర్పుతో మరోసారి యత్నించండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిరువ్యాపారులకు షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయజాలవు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్ధికంగా బాగుంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మిన వారే మిమ్ములను తప్పుదారి పట్టిస్తారు. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత ఉండదు. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యం సిద్ధిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బుధవారం నాడు కొత్తవారితో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు ప్రత్యేకతను చాటుకుంటారు. ట్రాన్స్పోర్టు రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
