సంబంధిత వార్తలు
- 10-07-2025 గురువారం మీ రాశి ఫలితాలు.. రుణ సమస్యలు వేధిస్తాయి..
- 09-07-2025 బుధవారం ఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...
- 08-07-2025 మంగళవారం ఫలితాలు - తొందరపాటు నిర్ణయాలు తగవు....
- 07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?
- 06-07-2026 సోమవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు...
11-07-2026 శనివారం ఫలితాలు- వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దు
Daily Astrology
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. ఆప్తులు ఆదుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమించిన కొద్దీ మంచి ఫలితాలుంటాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు దారి తీస్తుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. చిన్న చిన్న ఒత్తిళ్లున్నా మనోధైర్యం కోల్పోవద్దు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయం తగదు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన విషయాల్లో లౌక్యంగా మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు, ఖర్చులు అధికం. పనులు సానుకూలమవుతాయి. అనవర విషయాల్లో జోక్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
విశేష ఫలితాలున్నాయి. అనుకున్న కార్యం సాధిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఒత్తిళ్లకు గురికావద్దు, ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఇతరులను నిందించవద్దు. ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. బంధుమిత్రులతో సంభాషిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు సామాన్యం. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. ఒంటెద్దు పోకడ తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పధంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. పనుల్లో ఒత్తిడి అధికం. ఖర్చులు విపరీతం, సన్నిహితులను కలుసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దునుణుగుతుంది.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
ప్రతికూలతలను అధిగమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలమే. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు, పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమస్యలను నిబ్బరంగా ఎదుర్కుంటారు. మీ కార్యదీక్ష ప్రశంనీయమవుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త, పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దు. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
