1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 07-07-2026 Daily Astrology

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?

Astrology
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు నిలకడగా ఉండవు, అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. ఆచితూచి అడుగేయండి. దుబారా ఖర్చులు విపరీతం. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
గ్రహస్థితి నిరాశాజనకం, మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. పనులు మధ్యలో నిలిపివేయవద్దు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పత్రాలు అందుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. ప్రలోభాలకు లొంగవద్దు, సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలను మూల్యం చెల్లించుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విఫలమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. కొత్తయత్నాలు మొదలెడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. నోటీసులు అందుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం పొదుపుగా ఖర్చుచేయండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరచరాస్తులు వ్యవహారంలో ఏకాగ్రత వహించండి 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణవిముక్తులవుతారు. ఖర్చులు విపరీతం, ఆపత్సమయంలో సన్నిహితులను ఆదుకుంటారు. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. అప్రియమైన వార్త వినవలసివస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సంస్కరణ సమావేశంలో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. యత్నాలు కార్యరూపం దాల్చుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విందుకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కొత్తయత్నాలు మొదలెట్టండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. అపాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్నేహబంధాలు వెల్లివిరుస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. దళారులు, ప్రకటనలు నమ్మవద్దు, ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తల పెట్టిన కార్యం విజయవంతమవుతుంది. వేడుకకు ఆర్భాటంగా చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో పునరాలోచించండి. తొందరపాటు నిర్ణయం తగదు. న్యాయనిపుణుల సలహా పాటించండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యం నెరవేరుతుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తికాగలవు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. కొత్త ప్రదేశం సందర్శిస్తారు.
About Writer
సెల్వి