1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 06-07-2025 Daily Astrology

06-07-2026 సోమవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు...

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఖర్చులు విపరీతం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం. పట్టుదలకు పోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు సత్ప్రభావం చూపుతాయి. ఖర్చులు విపరీతం. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకుంటారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. దైవదర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంప్రదింపులకు తగిన సమయం. లావాదేవీల్లో ఒత్తిడికి గురికావద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల్లో శ్రమ అధికం. ముఖ్యులను సంప్రదిస్తారు. స్థల వివాదం పరిష్కారమవుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగకుండా చూసుకోండి. ఖర్చులు అధికం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. నోటీసులు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ప్రతికూలతలకు కుంగిపోవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ సమర్ధతపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాహనదారులకు దూకుడు తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అధికం. మితంగా సంభాషించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని విధాలా యోగదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య కలహం. సామరస్యంగా మెలగండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అధికం. పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి చికాకుపడతారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఉచితంగా ఏదీ ఆశించవద్దు. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు అధికం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
About Writer
పి.ప్రసూనా రామన్