సంబంధిత వార్తలు
05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు
Daily Astrology
వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు అధికం. ముఖ్యల కలయిక వీలుపడదు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. పత్రాలు అందుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు పురమాయించవద్దు, వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. పరిచయస్తులతో సంభాషిస్తారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధిక సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవచ్చు. అనవసర జోక్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సాధిస్తారు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయుద్దు. నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ శ్రీమతి మాటతీరు అసహనం కలిగిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం, గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఓర్పుతో శ్రమిస్తేనే పనులు పూర్తవుతాయి. అనవసర బాధ్యతలు తీసుకోవద్దు. పొగిడే వ్యక్తుల అంతర్యం గ్రహించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు ప్రయాణం తలపెడతారు.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు తగ్గించుకుంటారు. ధనసహాయం తగదు. ప్రముఖులు మీ సమర్థతను గుర్తిస్తారు. వ్యతిరేకులతో జూగ్రత్త, పసులు మందకొడిగా సాగుతాయి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్తయత్నాలు మొదలెడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. మీ కష్టం ఫలిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆప్తులను కలుసుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ముఖ్యలను కలుసుకుంటారు. రాజీమార్గంతో సమస్యలు పరిష్కారమవుతాయి.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పరిచయం లేనివారితో జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
