1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Dharmendra Pradhan breaks silence on resignation, says he volunteered to step down

జెన్ జీ మన పిల్లలే ... పిల్లల భవిష్యత్ కంటే మంత్రి పదవి ముఖ్యం కాదు : ధర్మేంద్ర ప్రధాన్

dharmendra pradhan
జెన్ జీ మన పిల్లలేనని, పిల్లల భవిష్యత్ కంటే మంత్రి పదవి ముఖ్యం కాదని కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన స్పందిస్తూ, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనల్లో జెన్ జీని కొందరు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. 
 
ఓ యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో ఆయన తొలిసారి తన రాజీనామాపై స్పందించారు. ప్రధాన్‌ మాట్లాడుతూ, 'జెన్‌ జీ మన పిల్లలే. వారి అభివృద్ధి దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉంది. వారితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గత పదేళ్లలో 20 కోట్ల, మంది పిల్లలు జన్మించారు. వారు భారత్‌ను 'విశ్వగురు'గా నిలబెడతారు. వారికంటే మంత్రి పదవి నాకు ముఖ్యమైనది కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి నేనే రాజీనామా చేసేందుకు ముందుకొచ్చాను' అని చెప్పారు. 
 
తనపై బీజేడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలకు భయపడేది లేదని ప్రధాన్‌ అన్నారు. భువనేశ్వర్ విమానాశ్రయం చేరుకున్న సమమంలో 'ధర్మేంద్ర ప్రధాన్‌ గో బ్యాక్‌' అంటూ నినాదాలు చేశారని.. అయినా తాను మళ్లీ వస్తానని చెప్పారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని గుర్తుచేశారు. బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ తనను రాష్ట్ర ప్రజల దృష్టిలో అవమానకరంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. అయితే తాను ఒడిశా ప్రజలకు ఎప్పుడూ తలవంపులు తెచ్చే పని చేయలేదన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వరుసగా నాలుగో రోజు పసిడి భగభగలు ... తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే...