జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)
Dipke
గత వారం రోజులుగా వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలోని నిర్ణీత నిరసన స్థలంలో ఆందోళనలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలోని నిరసనకారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, చక్ దే ఇండియా అనే దేశభక్తి గీతానికి వేదికపై నృత్యం చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Cockroach Janta Party (CJP) founder Abhijeet Dipke on Saturday urged young people to focus on education, employment and their future rather than communal politics, following Union Education Minister Dharmendra Pradhan's resignation.
— Hate Detector ???? (@HateDetectors) July 25, 2026
Addressing supporters, Dipke said, "Youth… https://t.co/nMa7jvxETn pic.twitter.com/JDapAmsho1
మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బొద్దింక జనతా పార్టీ శనివారం స్వాగతించింది. ఈ ఉద్యమంలో పోలీసు లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులను స్మరించుకుంటూ ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కానీ తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళనను కొనసాగిస్తామని చెప్పారు. అయితే, ఈ పోరాటం ఇంకా ముగియలేదని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ప్రభుత్వంతో ఇంకా చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం, నీట్ వివాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం, ఆందోళనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ తీసుకుంటామని ప్రకటించారు. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
Jantar Mantar
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు తనను హీరోగా కీర్తించవద్దని, ఆ ఘనత తనది కాదని ఆయన స్పష్టం చేశారు. యువతను కాక్రోచ్ లంటూ వ్యాఖ్యానించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని దీప్కే అన్నారు. ఆయన వల్లే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సాధ్యమైందని వ్యాఖ్యానించారు.
Big celebration at Jantar Mantar after Union Education Minister Dharmendra Pradhan's resignation. pic.twitter.com/AGUsNVVMdF
— NBT Dilli (@NBTDilli) July 25, 2026
