సంబంధిత వార్తలు
- 30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం
- 29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...
- 28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...
- 27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది
- 26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి
01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. నోటీసులు అందుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఎదురుచూస్తున్న పత్రాలు లభ్యమవుతాయి. ఏకాగ్రతలో వాహనం నడపండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి, కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. చీటికిమాటికి అసహనం చెందుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం పనులు మందకొడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. ముఖ్యమైన పసుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. లావాదేవీలతో సతమతమవుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడికి లొంగవద్దు, ప్రణాళికలు వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. అనవసర ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. ఆర్ధికంగా బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు సాఫీగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. సర్వత్రా అనుకూలం. మాట నిలబెట్టుకుంటారు. కష్టమనుకున్న పసులు తేలికగా పూర్తవుతాయి. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సన్మాన సంస్కరణ సభల్లో పాల్గొంటారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సమర్థతపై నమ్మకం సన్నగిల్లుతుంది. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. రుణ సమస్య కొలిక్కి వస్తుంది. చెల్లింపుల్లో జాగ్రత్త, పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు.
