సంబంధిత వార్తలు
- 26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి
- 25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...
- 24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు
- 23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది
- 22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు
27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం, ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఆదాయం నిరాశాజనకం. అసహనానికి లోనవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు, రుణాలు, చేబదుళ్లను స్వీకరిస్తారు. సన్నిహితుల సాయంతో అవసరం తీరుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. వాహనసౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు ధనం అందుకుంటారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమువుతుంది. పనులు చక్కబెట్టుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని ఆలక్ష్యంగా వదిలి వెళ్లకండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా అనుకూలతలున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. సాయం ఆశించవద్దు. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. బడ్జెట్ రూపొందించుకుంటారు. పనులు ఇతరులకు పురమాయించవద్దు. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశయ సాధనకు మరింత శ్రమించాలి. ధైర్యంగా ముందుకు సాగండి. అపోహలకు తావివ్వవద్దు. సంకల్ప బలమే మీ విజయానికి దోహదపడుతుంది. దంపతుల మధ్య కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య నెలకొంటుంది. ఇతరులతో సంప్రదింపులు జోక్యం తగదు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహసంచారం బాగుంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి. మీ కష్టం వృధా కాదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులు నన్నిహితులవుతారు. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఎంతటివారికైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను, చేజిక్కించుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయంలో పనులు సానుకూలవుతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నేడు అనుకూలదాయకం. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సామర్థ్యంపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. ఖర్చులు అధికం. కీలక వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్తవారితో మితంగా సంభాషించండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. తొందరపడి హామీలివ్వవద్దు. రావలసిన ధనం అందుతుంది. కొందరి రాక ఇబ్బంది. కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని సమస్యగా భావించవద్దు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులవ్వవద్దు.
