1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 24-06-2025 Daily Astrology

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్విరామంగా ప్రేమిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం పనులు స్తవ్యస్తంగా సాగుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆప్తులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలు చేపడతారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికాకుండా మెలగండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనయోగం. వాహనసౌఖ్యం ఉన్నాయి. తాకట్టు విడిపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు అధికం. అనవసర జోక్యం తగదు. పత్రాలు అందుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీస్తాయి. ఊహించని సంఘటనందురవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. మాట నిలబెట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా పడిన పసులు ఎట్టకేలకు పూర్తిపుతాయి. ఫోన్ సందేశాలు పెట్టించుకోవడం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యం నెరవేరే వరకు శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పరిచయాలు బలపడతాయి. లావాదేవీలతో సతమతమవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పసులు సాగవు. నోటీసులు అందుకుంటారు. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు ఇతరులకు పురమాయించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అన్ని విధాలా యోగదాయకం. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏకాగ్రతో శ్రమించండి. ఇతరులను తప్పుపట్టవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. మీ సాయంతో ఒకరికి నుంచి జరుగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ధైర్యంగా అడుగుముందుకేయండి. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. రోజువారీ ఖర్చులుంటాయి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త, ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగవద్దు. మిమ్మల్ని మోసగించేందుకు కొందరు యత్నిస్తారు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...